header

Green Chillies


పచ్చిమిర్చి – అద్భుతం

పచ్చిమిరపకాయలలో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంరక్షణను ఇస్తాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడి శరీరాన్ని శుద్ది చేస్తాయి. కేన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.
పచ్చిమిరపకాయలలో సి విటమిన్ ఉంటుంది. ఇది ముక్కుపుటాలను తెరుస్తుంది.శ్వాసవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చిమిరపకాయలలో తింటే చర్మానికి మేలు చేస్తుంది. పచ్చిమిరపకాయలలో ఉండే విటమిన్ ఇ చర్మానికి మెరుపు తెచ్చే సహజమైన నూనెలను విడుదల చేస్తుంది.
పచ్చిమిరపకాయలలో క్యాలరీలు ఉండవు. పురుషులకు సాధారణంగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ను నిరోధించేందుకు పచ్చిమిరపకాయలు సాయంచేస్తాయి.
డయాబెటిస్ వారికి రక్తంలో చక్కెరస్థాయిలు తక్కువ ఎక్కువ కాకుండా చేస్తాయి. పచ్చిమిరపకాయలలోని పీచుపదార్ధం జీర్ణశక్తికి దోహదపడుతుంది.
సహజసిద్ధంగా ఉండే ఐరన్ శరీరానికి కావాలంటే పచ్చిమిరపకాయలు కావలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఐరన్ లోపం లేకుండా సహాయం చేస్తుంది.
పచ్చిమిరపకాయలను ఎడా పెడా తినకూడదు వారి స్ధాయిని బట్టి తినాలి. నేరుగా కూడా తినకూడదు. కూరలలో తినాలి. పచ్చడిగా తినవచ్చు.

Untitled Document